5 March, 2026 | 8:07 PM

కూలీ కొడుకు.. ఖోఖోలో విజేయుడు

12-01-2026 01:20 AM
  1. ఉమ్మడి కరీంనగర్ నుండి ఎంపికైన ఏకైక క్రీడాకారుడు
  2. ఇప్పటికే 20సార్లు జాతీయజట్టులో స్థానం

ధర్మపురి, జనవరి11(విజయక్రాంతి): సామాన్య కూలీల బిడ్డ ఒకటి కాదు రెండూ కాదు ఏకంగా 20సార్లు జాతీయ స్థాయి ఖోఖో టీమ్ లో స్థానం సంపాదించి అందరిచేత వాహ్ వా అనిపించాడు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని రాములపల్లి మారుమూల గ్రామంలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బిరుదుల లచ్చయ్య సాయవ్వ ల ఏకైక కుమారుడు నరేష్ అరుదైన విజయం సాధించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల రాష్ట్ర ప్రభుత్వం  ఈనెల 11నుండి కాజీపేటలో నిర్వహించబోయే ఖో ఖో టీమ్ కు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి ప్రాతినిత్యం వహించబోతున్నాడు.

నరేష్ చిన్ననాటి నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఏడ్యూకేషన్ ఉన్నత విద్య చదువుకుని తన ఇష్టమైన ఖో ఖో ఆటలో చిన్ననాటి నుండి మక్కువతో  గురువులు, తల్లిదండ్రుల ప్రోత్సహకంతో వెనకడుగు వేయకుండా జాతీయ స్థాయి జట్టులో ఆడుతూ సత్తాచాటారు.

యాభై ఎనిమిదవ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ కి తెలంగాణ పురుషుల జట్టుకు ఎoపికయ్యారు. నరేష్ ఏకంగా ఇరవై సార్లు జాతీయస్థాయిలో పాల్గొనడం మరో విశేషం. పలుమార్లు జాతీయ జట్టుకు నాయకత్వం వహించి జట్టు నీ ముందుండి నడిపించి ఎన్నో పథకాలు తెలంగాణ జట్టుకి అందించారు. నరేష్ ఎంపిక పట్ల మండల వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు.