13-09-2025 03:37:07 AM
-కరీంనగర్ జిల్లాలో జోరు వర్షం
-హుజురాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం
-సైదాపూర్ మోడల్ స్కూల్ జలదిగ్బంధం
-భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 100 గొర్రెలు మృతి
హుజురాబాద్/చిగురుమామిడి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం రాత్రి జోరు వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజ న్‌తోపాటు పట్టణాన్ని గురువారం రాత్రి కురిసిన వర్షం ముంచెత్తింది. రహదారులు వాగుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో రాత్రంతా నిస్సహాయ స్థితిలో, ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు.
మామిళ్లవాడ, కిందివాడ, బుడగ జం గాల కాలనీ, పోచమ్మ వాడ, గాంధీనగర్, మారుతి నగర్, గ్యాస్ గోదాం ఏరియాలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మొత్తం వరద నీరు ఇండ్లలోకి చేరింది. ఇండ్లలో మో కాళ్ల లోతు నీళ్లలో నానా అవస్థలు పడ్డారు. గ్యాస్ గోదాం ఏరియాలో వేల్పుల శారదకు చెందిన జూట్ బ్యాగ్ ఇండస్ట్రీ నీట మునిగింది. రెండున్నర టన్నుల జూట్ బ్యాగులు నీటి పాలైయి సుమారు మూడు లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు నిర్వాహకురాలు శారద ఆవేదం వ్యక్తం చేశారు.
బుడజంగం కాలనీలో ఓ గుడిసె నేలమట్టమయింది. పట్టణంలోని చిలుక వాగు పొంగిపొర్లుతున్నది. చిలక వాగుపై వంతెన లేకపోవడంతో కనుకలగిద్ద, జూపాక గ్రామాల నుంచి వచ్చే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పట్టణ శివారులో నివాసం ఉండే వడ్డెర కాలనీ వాసులు ఏ అవసరానికైనా వాగు దాటి హుజురాబాద్‌కు రావాలి. వాగు ప్రవాహం ఎక్కువ కావడంతో ఇబ్బంది పడుతున్నారు.
కాగా మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి శుక్రవారం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించి, ఆస్తి నష్టం వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కాగా సైదాపూర్ మోడల్ స్కూల్ గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలదిగ్బంధంలోకి వెళ్లింది. రాత్రి ఉరుములతో కూడిన వర్షం కురువడంతో హాస్టల్ లోని 32 మంది విద్యార్థినులు భయం గుప్పెట్లో తెల్లవారుజాము వరకు ఉన్నారు.
తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయాన్నే వచ్చి విద్యార్థినులను ఇంటికి తీసుకువెళ్లారు. కాగా సైదాపూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి సోమవారం, ఎగ్లాస్పూర్, బూడిద పల్లిలోని వాగు లు పొంగిపొర్లాయి. వాగులకు గండిపడటంతో వరద నీరు రోడ్లపై ప్రవహించి, పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిగురుమామిడి మండలంలో నూ గురువారం రాత్రి వాన దంచికొట్టింది.
వర్షానికి కుంటలు, చెరువులు నిండాయి. పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు ఇళ్లలోకి, పాఠశాలకు, దేవాలయాల్లో నీరు చేరాయి. ఇందుర్తిలో అత్యధి కంగా 21.13 సెం.మీ.లు, చిగురుమామిడిలో 16.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇందుర్తి ఎల్లమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇందుర్తి నుంచి కోహెడ వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఓగులాపూర్ నుంచి మండల కేంద్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రేకొండ నుంచి మొగిలిపాలెం వెళ్లే రహదారి కల్వర్టు వద్ద వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది.
గాగిరెడ్డిపల్లిలోని బోల్లోని పల్లెలో కెనాల్ తెగి గ్రామంలోకి నీరు రావడంతో ఇళ్లన్నీ జలమయమయ్యా యి. సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. ఇందుర్తి ప్ర భుత్వ పాఠశాలలో నీరు చేరింది. రామంచలోని దేవుని చెరువు, కొత్త కుంట, నాగుల చె రువు, అమ్మ చెరువుల నుంచి మత్తడి పడటంతో ఊరు చివర ఇండ్ల పక్కన ఉన్న దర్గా నుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహించిం ది. పలు పంటలు నీట మునిగాయి. మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించడం తో ప్రజలు అటువైపుగా వెళ్లేందుకు సాహసించడం లేదు.
మత్తడి పోస్తున్న కటాక్షపూర్ చెరువు
వరంగల్ (మహబూబాబాద్) (విజయక్రాంతి): హైదరాబాద్ 163 జాతీయ రహదారిపై వరంగల్ మధ్య కటాక్షపూర్ చెరువు మత్తడి పోస్తోంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారిపై పనులు జరుగు తుండటం, బ్రిడ్జిపై రోడ్డు సరిగా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకేసారి ఎదురె దురుగా భారీ వాహనాలు వస్తే ట్రాఫిక్ జా మ్ అవుతోంది. వరద ఉధృతి మత్తడి వద్ద మరింత పెరగడంతో తేలికపాటి వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.
పిడుగుపాటుకు 100 గొర్రెలు మృతి
మహదేవపూర్(విజయక్రాంతి): జ యశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లేంకలగడ్డ గ్రామం గోదావరి సమీపంలో గురువారం రాత్రి భా రీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే గొ ర్రెల మందపై పిడుగు పడటంతో 100 గొర్రెలు మృతి చెందాయి.