02-10-2025 01:29:04 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబరు 1 (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరా మారంలోని వేల కోట్ల రూపాయల విలువైన సుమారు 320 ఎకరాల ప్రభుత్వ భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, దానిని తక్షణమే పరిరక్షించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శ్రవణ్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు.
హైడ్రా కార్యాల యంలో కమిషనర్‌ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. “గాజులరామారం 307 సర్వే నంబర్‌లోని 317 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని అన్ని ప్రభుత్వ శాఖలకు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. కొందరు భూస్వాములు దొంగ పత్రాలు సృష్టించి పేదలకు అమ్ముతున్నారు.
నెల రోజుల క్రితం హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన వెంటనే స్పందించి భూమి చుట్టూ కంచె వేయించారు. కానీ ఇప్పుడు కబ్జాదారులు ఆ కంచెను సైతం తొలగించి మళ్లీ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ భూమిలోనే అధికారులు వెంచర్లకు పర్మిషన్లు ఇస్తున్నారు. కాబట్టి, ప్రజలెవరూ ఆ సర్వే నంబర్‌లోని వెంచర్లలో భూములు కొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ భూమిని నిరుపేదల కోసం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను,” అని అన్నారు. ఎమ్మెల్సీ శ్రవణ్ మాట్లాడుతూ.. “గాజులరామారంలోని వేల కోట్ల విలువ చేసే ఈ ప్రభుత్వ భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కబ్జా చేశారు.
దీనిపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఒంటరి పోరా టం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఈ భూమిని కాపాడాలని మేం కమిషనర్‌ను కోరాం. ఆయ న మా ఫిర్యాదుకు సానుకూ లంగా స్పందించారు” అని ఎమ్మెల్సీ శ్రవణ్ చెప్పారు. ఈ ఫిర్యాదుతో గాజులరామారం భూ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.