calender_icon.png 17 September, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత మూడేళ్లు కఠినంగా

12-11-2024 12:00:00 AM

డర్బన్: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సఫారీ పర్యటనలో అదరగొడుతున్నాడు. తొలి టీ20 విజయంలో కీలక పాత్ర పోషించిన వరుణ్ రెండో టీ20లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన సంగతి తెలిసిందే. ‘గత మూడేళ్లు నాకు ఎంతో కఠినంగా గడిచింది. డ్రాయింగ్ బోర్డుపై బంతు లు విసురుతూ వీడియోలో నా బౌలింగ్‌లో తప్పులు వెతికాను. సైడ్ స్పిన్ వల్ల ఉపయోగం లేదని తేలింది. రెండేళ్లలో నా బౌలింగ్‌ను పూర్తిగా మార్చుకున్నా. ఈ ఏడాది లోకల్ లీగ్స్‌తో పాటు ఐపీఎల్‌లో కొత్త బౌలింగ్ వైవిధ్యాన్ని ప్రదర్శించి సఫలీకృతమయ్యా. సఫారీ పర్యటనలో కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేయడం సంతోషంగా అనిపిస్తోంది. ఇలాంటి ప్రదర్శన మున్ముందు మరింత చేయాలనుకుంటున్నా’ అని తెలిపాడు.