calender_icon.png 1 October, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్టీ రిజర్వేషన్ వచ్చేదాకా న్యాయపోరాటం ఆగదు

01-10-2025 01:21:14 AM

  1. ఆ మూడు తండాలో అందరూ గిరిజనులే..
  2. ఒక్క బీసీ లేకున్నా.. జీపీ రిజర్వేషన్ బీసీకి.. 
  3. గిరిజనుల హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 
  4. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్‌కు ఫకీర్ నాయక్ గిరిజనతండా వాసుల వినతి 

కుభీర్, సెప్టెంబర్ 30: తమ గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ కల్పించే వరకు ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఫకీర్ నాయక్ గిరిజన తండా నాయకులు, మాజీ సర్పంచులు గోపీచంద్ జాదవ్, పండిత్ జాదవ్ పేర్కొన్నారు. మంగళవారం వారు పైసాలోని సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్‌ను కలిసి తమ గిరిజన తండాలో 1400 వరకు జనాభా ఉంది.

అందులో ఏ ఒక్కరు కూడా బీసీలు లేకపోయినప్పటికీ బీసీ రిజర్వేషన్ కల్పించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జరిగిన పొరపాటును  సవరించి తమకు న్యాయం చేసి ఎస్టీ రిజర్వేషన్ను కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో జిల్లా యంత్రాంగం ప్రకటించిన రిజర్వేషన్లపై గందరగోళం నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణ రిపోర్ట్ తప్పిదం కారణంగా కుబీర్ మండలంలోని మూడు తండాల్లో బీసీలు లేకుండా సర్పంచ్ సీటు బీసీ రిజర్వేషన్ ఖరారు కావడంపై గిరిజనులు అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు గందరగోళానికి దారితీసాయి. మండలంలోని ఫకీర్ నాయక్ తండా, దావూజీ నాయక్ తండా రెండింటిలో 100% గిరిజనులు ఉన్నారు.

అయి నప్పటికీ రిజర్వేషన్ మాత్రం బిసి జనరల్ కు కేటాయించారు. ఈ పరిణామం గిరిజన తం డావాసులను విస్మయానికి గురిచేసింది. ఒక్కరంటే ఒక్కరు కూడా బీసీలు లేని గిరిజ న తండాల జీపి లకు బీసీ రిజర్వేషన్ కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫకీర్ నాయక్ తండాలో 1483 మంది గిరిజన జనాభా ఉంది. దావూజీ నాయక్ తం డాలో జనాభా 830 గిరిజనులు, 563 ఓట ర్లు ఉన్నారు. ఏ ప్రాతిపదికన ఒక్కరు కూడా బీసీలు లేని గిరిజన తండాల జీపీలలో బీసీ రిజర్వేషన్ రావడం పట్ల ఆ గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.