calender_icon.png 1 October, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ అక్రమార్కులపై కఠిన చర్యలు

01-10-2025 01:18:37 AM

  1. ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి హెచ్చరిక
  2. పేదల భూమీ కబ్జాకు యత్నం, అట్రాసిటీ కేసులో బీజేపీ నేత అరెస్ట్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాం తి) : ఫోర్జరీ, దౌర్జన్యం, చీటింగ్ కేసులలో ప్రజలు నిర్భయంగా పోలీసు వ్యవస్థని సం ప్రదించవచ్చనీ ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి అన్నారు. నకిలీ పత్రాలు సృష్టిం చి ప్రభుత్వ, పేద ప్రజల భూములను కబ్జా చేయాలనుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. మంగళవారం సమావేశంలో డిఎ స్పి మాట్లాడుతూ... మావల పోలీస్ స్టేషన్ పరిధిలో దళితుల భూమీ కబ్జాకు ప్రయత్నం చేసి, బెదిరించిన కేసులో బీజేపీ మాజీ కౌన్సిలర్, నిందితుడు ఉష్కం రఘుపతిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

తదుపరి న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యూడిషల్ రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు. నిరుపేద అయినా ఫిర్యాదు దారుడు ఎరే గంగ న్న కు చెందిన భూమిని రఘుపతి కబ్జా చేసుకుని, బెదిరించడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితుడు రాఘుపతి పై ఇప్పటికే మావల పీఎస్ లో రౌడీ షీటు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మావల సీఐ కర్ర స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.