09-02-2025 07:23:38 PM
పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో బావి పూడ్చివేత..
మునుగోడు (విజయక్రాంతి): నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన మండలంలోని సింగారం గ్రామ శివారులో మూలమలుపు వద్ద ఉన్న బావికి పోలీస్ యంత్రాంగం శాశ్వత పరిష్కారాన్ని చూపారు. మూలమలుపు వద్ద కనబడక ఇటీవల అర్థ రాత్రి సమయంలో బావిలో ప్రయాణికులు ప్రయాణిస్తున్న జీపు పడ్డ కారణంగా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలకై ఆర్ఆర్ఆర్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు మరమ్మతులు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రారంభించి, నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ, రాష్ట్రీయ రహదారుల, ఆర్ అండ్ బి పంచాయతి రాజ్ రోడ్డు గ్రామాల మధ్య నుంచి వెళ్లే గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల ప్రజలు, వాహనదారులు రోడ్డు దాటుతున్న క్రమంలో అనేక ప్రమాదాలకు గురవుతున్నారు.
ఈ ప్రమాదాల నివారణకు ఆర్ఆర్ఆర్ నూతన కార్యక్రమం ద్వారా సంబంధిత పోలీస్ అధికారులు, రోడ్డు సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో మునుగోడు నుంచి నార్కట్పల్లి ఆర్ & బి రోడ్డులో గల సింగారం గ్రామ శివారులో ఉన్న మూల మలుపు వద్ద బావిలో వాహనాలు పడి ప్రమాదాలు జరుతుండగా ప్రదేశాన్ని గుర్తించి సంబంధిత అధికారులతో బావిని పూడిపించి ప్రమాదాలు జరగకుండా పరిష్కారాన్ని చూపారు.