25-07-2025 02:15:11 AM
జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి
కాప్రా, జూలై 24 : కాప్రా చెరువు పరిరక్షణ కోసం సంబంధిత శాఖల సమన్వయం తో సమగ్ర చర్యలు చేపట్టాలని జాతీయ మా నవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సాయిని సూచించారు. చెరువు నీటి వనరులను కాపాడేందుకు జీహెఎంసీ, రెవె న్యూ, ఇరిగేషన్ శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని ఆమె సూచించారు. గురువారం ఆ మె కాప్రాలోని స్వగృహంలో కాప్రా చెరువు సంరక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్, కాప్రా డిప్యూటీ కమిషనర్ జగన్, ఎమ్మార్వో సుచరిత, కుషాయి గూడ ఏసిపి వెంకట్ రెడ్డి, సీఐ భాస్కర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం విజయభారతి సాయని చెరువును ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడి పరిస్థి తులను వివరణతో తెలుసుకున్నారు.
చెరువు పరిసర ప్రాంతాల్లో గంజా యి, మద్యం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలని కుషాయిగూడ ఏసిపి వెంకట్ రెడ్డి, సీఐ భాస్కర్ రెడ్డికి సూచించారు. చెరువు ప్రాతినిధ్యం కలిగిన ప్రాంతాల్లో ప ర్యావరణాన్ని రక్షించేందుకు మరియు ప్రజలకు ఉపయోగకరంగా మారేలా చర్యలు తీసుకోవాల న్నారు. స్థానిక ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు చెరువు పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.