01-11-2025 08:00:33 PM
నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రాణాలు పోగొట్టుకోవద్దు..
మరిపెడ ఎస్ హెచ్ ఓ వీరభద్రరావు..
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం 365 జాతీయ రహదారిపై బొలెరో బోల్తా పడి ఒకరు మృతిచెందారు. ఈ ఘటన శనివారం బురహాన్ పురం గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఉప్పరగూడెం పరిధిలోని హము తండకు చెందిన ఇద్దరు వ్యక్తులు మరిపెడ మండలం లచ్చతండకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇరువురు సూర్యాపేట జిల్లా కేంద్రంలో క్యాటరింగ్ పని నిమిత్తం వెళ్తున్న క్రమంలో మరిపెడ మండల బురహాన్ పురం గ్రామ శివారులో కుక్క అడ్డురావడంతో తప్పించబోయి బోల్తా పడిన సంఘటనలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం 108 లో మహాబూబా ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మండల గ్రామ శివారు తూక తండాకు చెందిన మాలోతు గణేష్ ఆలియాస్ పవన్ (20) మృతి చెందాడు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మరిపెడ ఎస్సై వీరభద్రరావు తెలిపారు.