సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘటన
జైపూర్, జూన్ ౧౫: కాక్రోచెస్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పై కొందరు యువకులు దాడికి పాల్పడిన ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగింది. దాడికి పాల్పడిన యువకులపై సీజేపీ కార్యకర్తలు తిరిగి పాల్పడటంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసు లు, భద్రతా బలగాలు అతికష్టం మీద ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితులను అదుపు లోకి తీసుకొచ్చారు. నీట్ యూజీ లీకేజీకి నిరసనగా సీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది.
దీంతో సోమవారం జైపూర్‌లోని షహీద్ స్మారక్ వద్దకు వందల సంఖ్యలో మద్దతుదారులు వచ్చి శాంతియుతంగా ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో దీప్కే అక్కడికి చేరుకున్నారు. వెంటనే మద్దతుదారులు ఆ యన్ను తమ భుజాలపైకి ఎత్తుకుని ప్రధాన వేదిక వైపు తీసుకువెళుతుండగా కొందరు ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన మద్దతుదారులు, పోలీసులు ఆ యన్ను పక్కకు లాగారు. దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. అ నంతరం దీప్కే ‘ఎక్స్’లో స్పందించారు. భౌతిక దాడులు పిరికిపందల పని అంటూ నిప్పు లు చెరిగారు. తాము గాంధీ, అంబేద్క ర్ ఆశయాల మార్గంలో నడిచేవాళ్లమని, శాంతి యుతంగానే తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, తమను భయభ్రాంతులకు గురిచేయా లనుకోవడం మూర్ఖత్వమే అన్నారు.






