03-05-2025 01:05:58 AM
ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు కోతుల దండ యాత్ర
ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు
మంచిర్యాల, మే 2 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చిన గాలి, వడగండ్ల వాన బీభత్సానికి జిల్లాలోని నేన్నెల, కన్నెపల్లి, చెన్నూరు, భీమారం, జైపూర్ తదితర మండలాల్లో మామిడి, వరి పంటలతో పాటు గ్రామాలలోని పలువురి ఇండ్లు దెబ్బతిన్నాయి. జిల్లా రైతన్నలను వడగండ్ల వాన తీవ్రంగా నష్ట పరిచింది.
వరి, మామిడికి నష్టం
జిల్లాలో ప్రధానంగా జైపూర్, భీమారం, నెన్నెల, చెన్నూర్ మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 527 మంది రైతులకు చెందిన సుమారు 1400 ఎకరాలలో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది, 90 మంది రైతులకు చెందిన సుమారు 135 ఎకరాలలో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఆవడం లాంటి ప్రాంతాలలో పెద్ద పెద్ద మామిడి చెట్లు విరిగి పోయాయి.
హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు ప్రాథమికంగా అంచన వేసి జిల్లా స్థాయి అధికారులకు నష్టం వివరాలను అందజేశారు. చేతికి వచ్చిన పంట నేల పాలు కావడంతో రైతులు కన్నీరు పెట్టారు. రేపో మాపు మామిడి పంట కోసి మార్కెట్ కు తరలిద్దామనుకున్న రైతులకు తీవ్ర నిరాశనే ఎదురయ్యింది. అక్కడక్కడా ఆర బోసిన పరిధాన్యం వర్మంకు తడిసి ముద్దయింది.
దెబ్బతిన్న ఇండ్లు...
జిల్లాలో గాలివాన బీభత్సంతో పెద్ద మొత్తంలో ఇండ్లు దెబ్బతిన్నాయి. ప్రధానం గా భీమారం, నెన్నేల, జైపూర్ మండలంలో గృహాలు దెబ్బతిన్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు నెన్నెల మండలం గంగా రం, ఆవుడం, చిన్నవెంకటాపూర్, కొత్తూర్, ఘన్పూర్, చిత్తాపూర్, నెన్నెల, ఘన్పూర్, నందులపల్లి గ్రామాలలో పలువురి గుడిసేలు, రేకులు, పెంకుటిల్లు దాదాపు రెండు వందల వరకు దెబ్బతిన్నాయి.
రేకులు, ఇండ్ల పైకప్పులు ఎక్కడిక్కడ లేచి కొట్టుకు పోయా యి. గాలి వాన వలన ఇండ్లలో రాత్రి వేళ నిద్రిస్తున్న పలువురికి గాయలయ్యాయి. మూగజీవాలు, పశుపక్షాదులు గాయపడ్డా యి. పలు గ్రామాలలో విద్యుత్ తీగ లు, స్థంబాలు కూలిపోయినవి. జిల్లాలో 176 విద్యుత్ స్తంభాలు, 14 వరకు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.
మందమర్రి: జిల్లాలో గురువారం రాత్రి వీచిన గాలి దుమారం బీభత్సానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి కాయలు నేల రాలి రైతుల ఆశలు అడియాశలయ్యాయని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నెన్నెల, బెల్లంపల్లి, మందమర్రి భీమారం జైపూర్ మండలాలు మామిడి తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ సుమారు 2,000 మంది రైతులు దశాబ్దాలుగా మా మిడి తోటలను పెంచుతూ మామిడిపై ఆధారపడి జీవిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాల మూలంగా...
మామిడి రైతులపై ప్రకృతి పగపట్టిందని గత అనేక సంవత్సరాలుగా గాలి దుమారా లు అకాల వర్షాలు మూలంగా మామిడి పంట తీవ్రంగా నష్ట మామిడి రైతులు కన్నీ టి పర్యటనవుతున్నారు. పంట చేతికి సమయానికి ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు కోతుల దండ యాత్రలతో పంట చేతికచ్చే పరిస్థితి లేకుండా పోతుందని ఆరుగాలం తోటలో నమ్ముకుని జీవిస్తున్న తమ కు ఏదో ఒక రూపంలో నష్టం వాటిల్లుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుత సంవత్సరం పంట అంతంత మాత్ర మే ఉండగా వాతావరణం మార్పులు, తేనె మంచు పురుగుల దాడి మామిడి రైతులకు తీవ్ర నష్టానికి గురి చేస్తున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తోడు గురువారం గాలి దుమారం బీభత్సంతో మామిడి కాయ లు నేల రాలడమే కాకుండా మామిడి చెట్లు విరిగిపడడంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయ ని పలువురు రైతులు రోదిస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి...
ప్రకృతి పైపరీత్యాల మూలంగా మామిడి పండ్లను కోల్పోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని పలువురు మామిడి రైతులు ప్రభుత్వాన్ని కోరు తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా మామి డి పంట ఆశాజనకంగా లేదని పండిన పం టకు మార్కెటింగ్ లేక నష్టపోవడం ఒక వం తు అయితే ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నేల రాలి ఆశలు సన్నగిల్లుతు న్నాయ ని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.