calender_icon.png 21 December, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పునర్జన్మ జ్ఞాపకాలు వెంటాడితే?

21-12-2025 12:03:52 AM

మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న మూవీ ‘వృషభ’. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నందకిషోర్ మలయాళం, తెలుగులో రూపొందించారు. ఈ నెల 25 ఈ సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది సెంచరీగా పేరు తెచ్చుకుంటాడు ఆదిదేవవర్మ (మోహన్‌లాల్). కెరీర్‌లో తిరుగులేని ఆదిదేవవర్మ మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. అతనికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకువస్తుంటాయి. ఆ జ్ఞాపకాల్లో రాజా విజయేంద్ర వృషభ (మోహన్‌లాల్) అసమాన యోధుడిగా తన సామ్రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు.

ఆదిదేవవర్మ కొడుకు (సమర్జీత్ లంకేశ్) సైకియాట్రిస్టులతో సంప్రదింపులు చేస్తూ, శత్రు దాడుల నుంచి తండ్రిని కాపాడుకుంటూ ఉంటాడు. ఆదిదేవ వర్మను వెంటాడుతున్నవి పునర్జన్మ జ్ఞాపకాలేనా? ఆ జ్ఞాపకాల్లోని రాజా విజయేంద్ర వృషభ గొప్పతనం ఏంటి? ఈ గతాన్ని, ఈ వర్తమానాన్ని కలుపుతూ కథ ఎలాంటి మలుపులతో సాగింది? అనేది ట్రైలర్‌లో ఆసక్తి కలిగించింది. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, అరియన్ మెహెదీ; సినిమాటోగ్రఫీ: ఆంటోనీ సామ్ సన్; ఎడిటింగ్: కేఎమ్ ప్రకాశ్.