31-07-2025 12:15:58 AM
సూర్యాపేట, జూలై 30 (విజయక్రాంతి) :బిసీలకు 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పించేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టరు ఊర రామ్మూర్తి యాదవ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని మహావీర్ ఫుడ్ కోర్ట్ లో గల మినీ ఫంక్షన్ హాల్ లో బుధవారం జన సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తగుళ్ల జనార్ధన్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీలకు స్థానిక సంస్థలతో పాటు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, బహుజన మహాసభ నాయకులు వెంకట్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సైదులు, జై భారత్ రాష్ట్ర నాయకులు గుండు వెంకన్న, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మర్యాద సైదులు యాదవ్, తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర నాయకులు సందీప్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బొల్లెద్దు వినయ్, బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు భద్రబోయిన సైదులు తదితరులు పాల్గొన్నారు.