31-07-2025 12:14:42 AM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం, జూలై 30:అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందచేస్తామనీ ఇబ్రహీంపట్నం ఎ మ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం, శాస్త్ర గా ర్డెన్స్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఇబ్ర హీంపట్నం మండలం, మున్సిపాలిటీ, అదిబట్ల మున్సి పాలిటి పరిధిలోని లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రంగారెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను 18 నెలలలోనే అమలు చేస్తున్నామని, మిగతా పథకాలను కూడా అమలు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి, ప్రజలకు రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమం-అభివృద్ధి పేరుతో పేదలకు పథకాలు అందచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక మధుసూదన్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ మంఖాల కరుణాకర్, ఎమ్మార్వో సునీత రెడ్డి, మునిసిపల్ కమిషనర్లు సత్యనారాయణ రెడ్డి, బాలకృష్ణ తో పాటు ఆయా గ్రామాల కార్యదర్శులు, వార్డు అధికారులు, ఇందిరమ్మ కమిటి సభ్యులు తదితరులుపాల్గొన్నారు.