16-09-2025 12:00:00 AM
తలకొండపల్లి, సెప్టెంబరు 15: కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విదంగా చేయూత పింఛన్లను పెంచే వరకు ప్రభుత్వం పై ఉద్యమం ఆగదని ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో పింఛన్ లబ్దిదారులు తలకొండపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం దర్నా నిర్వ హించారు. పింఛన్ల పెంపు మరిచిన ప్రభుత్వంపై ఎమ్మార్పీస్ వ్యవస్తాపక అద్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు.
అందులో భాగంగా మండల తహశీల్దార్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు.మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు సోమవారం లబ్దిదారులు తహసిల్దారు కార్యాలం ముట్టడి దర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రేస్ రాష్ట్రంలో తమ పార్టీ అదికారంలోకి వస్తే వికలాంగులకు రూ.6వేలు, వృద్దులు, వితంతువులు, వంటరి మహిళలకు రూ.4వేలు చొప్పున పింఛన్లు అందజే స్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అనంతరం తహసిల్దారు రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. వృద్దులు, వికలాం గులు, వంటరి మహిళలు, ఎమ్మార్పీస్, ఎంఎస్‌ఎఫ్, వీహెచ్ పిఎస్ మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తహసిల్దార్ కార్యాలయం ముట్టడి
యాచారం సెప్టెంబర్ 15 :రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, ఒంటరి మహిళల పింఛన్లు వెంటనే పెంచాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రం లోని తహసిల్దార్ కార్యాలయా న్ని ముట్టడించి ధర్నా నిర్వ హించారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్, విహెచ్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలో దివ్యాంగుల ఫించన్ 4వేల నుండి 6వేలకు, వృద్ధాప్య, వితంతు, గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళల ఫించన్లు 2 వేల నుండి 4 వేలకు పెంచుతామ ని హామీ ఇచ్చి అధికారం చేపట్టి 20 నెలలు పూర్తయి నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల డిప్యూటీ తహసీల్దార్ కు అంద చేశారు. విహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు డేరంగుల ఈశ్వర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ములి మహేష్ ఎమ్మార్పీఎస్ మందలింగం కందుకూరి కొండల్ విహెచ్పిఎస్ మాల్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోశయ్య, వికలాంగులు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
దివ్యాంగుల పింఛన్లు పెంచాలి
ఎల్బీనగర్, సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు పింఛన్లు పెంచాలని దివ్యాంగులు, ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మార్పీఎస్, వీహెచ్ పీఎస్ నాయకులు ముట్టడిం చారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఎల్బీనగర్ ఇన్ చార్జి బత్తిన సుధాకర్ మాదిగ, వీహెచ్ పీఎస్(వికలాంగుల హక్కుల పోరాట సమితి) రాష్ట్ర నాయ కురాలు విద్యావతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో 40 రోజుల్లో వికలాంగులకు పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్, పీహెచ్ పీఎస్ నాయకులు ప్రకాష్ మాదిగ, మల్లెపూవు రాజు, శేఖర్, పెద్ద ఉషను, దేవా, ఎరుగు రవి, సురేశ్, చంటి, అశోక్, మౌలాలి శివ, రంగన్న, ఏలియా రామన్న, గణేశ్ పాల్గొన్నారు.