calender_icon.png 16 September, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమీకృత మార్కెట్‌కు గ్రహణం వీడేదెప్పుడు?

16-09-2025 12:00:00 AM

  1. రెండేళ్లుగా నిలిచిపోయిన నిర్మాణ పనులు

రోడ్లపైనే సాగుతున్న కూరగాయల వ్యాపారాలు

కల్వకుర్తి సెప్టెంబర్ 15 : పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు కావాల్సిన కూరగాయలు మాంసం వంటి నిత్యవసర వస్తువులు అన్ని ఒకే చోట లభించేలా ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రి తం సమీకృత మార్కెట్ల నిర్మాణానికి నిధు లు మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ని ర్మాణం చేపట్టేలా ప్రణాళికలు చేసింది .

కొ న్నిచోట్ల స్థలాలు అందుబాటులో లేకపోవడంతొ అనువైన స్థలాలు ఉన్నచోట నిధులు మంజూరు కావడంతో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. దీంతో సంవత్సర కాలంలోనే సమీకృత మార్కెటు అందుబాటులోకి వస్తుందని ప్రజలు ఆశించినప్పటికీ ప్రభుత్వాలు మారడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. 

పిల్లర్ల దశలోనే నిర్మాణాలు..!    

గత ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో ఇం టిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ,4.5 కో ట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులు ద క్కించుకున్న కాంట్రాక్టర్లు ప్రారంభంలో ని ర్మాణం వేగవంతంగా చేసినప్పటికీ సకాలంలో బిల్లులు రాకపోవడంతో చేతులెత్తేశా రు. అనంతరం ఎన్నికలు జరగడం ప్రభుత్వాలు మారడంతో మార్కెట్ నిర్మాణాన్ని ఎ వరు పట్టించుకోవడం లేదు.

కల్వకుర్తి, నాగ ర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 70శాతం పను లు చేసినప్పటికీ బిల్లులు రాకపోవడంతో రెండేళ్లుగా ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులను కొనసాగించి సమీకృత మార్కెట్ను అందుబాటులోకి తేవాలని ప్రజ లు కోరుతున్నారు.

పనులు చేపట్టేందుకు చర్యలు..!

సమీకృత మార్కెట్ నిలిచిపోయిన పనులను కొనసాగించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే ప నులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

మహమూద్ షేక్, కల్వకుర్తీమున్సిపాలిటీ.