calender_icon.png 16 September, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా హిందీ దినోత్సవం

16-09-2025 12:00:00 AM

బాల్కొండ లో హిందీ  టీచర్లను సన్మానించిన మండల విద్యాశాఖాధికారి 

బాల్కొండ , సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): బాల్కొండ మండలం లోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హిందీ  కవుల పైన  చిత్రలేఖనం, హిందీ దేశభక్తి పాటలు,కథానాటికలు, సంభాషణలు, కవితలు, దోహాలు,  వంటి అంశాలతో చార్టులను ప్రదర్శించారు. భాషపై ఆసక్తిని పెంచే వినూత్న కార్యక్రమాలతో అందరినీ   విద్యార్థిని విద్యార్థులుఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా  మండల విద్యాశాఖ అధికారి బట్టు  రాజేశ్వర్ మాట్లాడుతు విభిన్న సంస్కృతుల భారతీయులందరినీ ఒక్క   తాటిపై తీసుకురావడానికి జాతీయవాదం  అభివృద్ధి చెందుటకు హింది భాషా ఎంతో గాను ఉపయోగపడుతుందన్నారు. భారత రాజ్యాంగం 1949 నుండి  సెప్టెంబర్ 14  హిందీ దివస్ గా జరపడానికి ముందుకు వచ్చింది  జాతీయ భాష అయిన హిందీ భాష వల్ల విద్యార్థుల ఆలోచనా శక్తి, భాషా ప్రావీణ్యం, భాషాభివృద్ధి జరుగుతుందని అన్నారు.

హిందీ విభాగ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో రాజా భాషా అయిన హిందీ భాషా పట్ల ఆసక్తిని పెంపొందించినందుకు  హిందీ భాషా ఉపాధ్యాయులు  సాయికుమార్, సంగీత రాణి లను అభినందించారు. ఈ కార్యక్రమంలో , ఇన్చార్జ్  ప్రధానోపాధ్యాయులు  ప్రశాంత్ కుమార్, పిఆర్సి ప్రభాకర్ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో..

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలోని మోడల్ స్కూల్లో సోమవారం హిందీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు . ప్రతి సంవత్సరం 14 సెప్టెంబర్ రోజున హిందీ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని ప్రిన్సిపల్ గాంధీ అన్నారు. హిందీ భాష దేశంలోనే ప్రజలను ఏకమవడానికి ఉపయోగపడుతుందని అన్నారు .అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బలవంతరావు, ప్రియదర్శిని, లక్ష్మణ్ సింగ్, రాజశేఖర్, శివకుమార్,  పాల్గొన్నారు.