05-09-2025 07:42:40 PM
బురదమయంగా నిమజ్జన స్థలా ప్రాంగణం..
కోదాడ: కోదాడ(Kodad) పెద్ద చెరువులో ఏర్పాటుచేసిన నిమజ్జన కార్యక్రమం స్థల ప్రాంగణం సరైన వసతులు లేకపోవడంతో నిమజ్జన కార్యక్రమానికి వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాంగణం మొత్తం బురదమయంగా ఉండడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బురదగా ఉండడంతో విగ్రహాలను దించే క్రెను కూడా దిగబడుతుంది. కనీస సదుపాయాలను ఏర్పాటు చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విగ్రహాలను నిమర్జనం తక్కువ లోతులనే చేస్తుండడంతో భక్తులు కనీసం లోతులో విగ్రహాలను వదలక పోతే ఎలా మునుగుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. స్థలా ప్రాంగణంలో సరైన విద్యుత్తు లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని తెలుస్తుంది.నిమజ్జన స్థల ప్రాంగణాన్ని పోలీసులు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.