calender_icon.png 6 September, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

05-09-2025 07:44:41 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని  నిత్యవసర వస్తువులు ఎలక్ట్రికల్ వస్తువులు వంట వస్తువులు పై జిఎస్టి తగ్గించడాన్ని హర్షిస్తూ  అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలభిషకం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు రేషన్ బియ్యంలో ఇస్తున్నప్పటికిని కాంగ్రెస్ ప్రభుత్వం మేమే ఇస్తున్నమని డబ్బా కొట్టుకోవడం సిగ్గుచేటని అన్నారు.

మధ్యతరగతి కుటుంబానికి దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలకు వనుకు పుట్టేలా జీఎస్టీ బారాన్ని తగ్గించి దేశీయ వస్తువులు కొనేలాప్రోత్సహించే విధంగా మోడీ నిర్ణయం స్వాగతిస్తున్నామని తెలియజేశారు ప్రతాప రామకృష్ణ. మాట్లాడుతూ అతిపెద్ద దేశమైన భారత దేశంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారత ప్రజల అవసరాలకు కనుగుణంగా జీఎస్టీ తగ్గించడం హర్పించదగ్గ విషయమని అన్నారు.