calender_icon.png 16 December, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదిరాజ్‌లు రాజకీయంగా ముందుండాలి..

16-12-2025 12:16:16 AM

ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, మండలి వైస్ చైర్మన్ డా. బండ ప్రకాష్ 

వెల్దండ, డిసెంబర్ 15: ముదిరాజులు రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండాలని ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు, మండలి వైస్ చైర్మన్ డా. బండ ప్రకాష్ అన్నారు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలో  ముదిరాజ్ లతో చర్చించారు. స్థానిక ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన వెల్దండ ఉపసర్పంచ్ బస్న మోని శ్రీను, వార్డు సభ్యులు మిరియాల మంజుల శ్రీను, పిల్లి దేవేందర్, బాదేపల్లి రమేష్, చెరుకూరు గ్రామ వార్డు సభ్యులు లాలయ్య, రమేష్ లను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు నూకం వెంకటయ్య, కృష్ణ , జిల్లా యువజన అధ్యక్షులు చందు, జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ భూనుచందర్, వెల్దండ మండల అధ్యక్షుడు బాధేపల్లి మల్లేష్, యువజన అధ్యక్షుడు బొక్కల శ్రీనివాస్, అన్నేపు వెంకటేష్ , మాసుల బాలరాజు,మొక్తల శ్రీనివాస్, కసారపు మల్లేష్, గంటల నరసింహ, మాసుల మల్లేష్, రంగరాతీ శ్రీశైలం, శివ, రమేష్ తదితర నాయకులు ఉన్నారు.