16-12-2025 12:17:45 AM
మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 15 : హన్వాడ మండల పరిధిలోని టంకర గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు టంకర శ్రీనివాసులు ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకున్న మహబూబ్నగర్ ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్నగర్ నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటు న్న కళాకారుడు టంకర శ్రీనివాసులు ఇంటి కి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే శ్రీనివాసులుకి ధైర్యం చెప్పి మనోధైర్యాన్ని కల్పిం చారు.కళారంగానికి సేవలందిస్తున్న శ్రీని వాసులు త్వరగా కోలుకుని మళ్లీ తన కళాసేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు.