calender_icon.png 24 January, 2026 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

24-01-2026 12:00:00 AM

కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, జనవరి 23 (విజయ క్రాంతి): పొరపాట్లకు తావివ్వకుండా మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలె క్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలోని కరీంనగర్ నగరపాలిక, హుజురాబాద్, చొప్పదం డి , జమ్మికుంట మున్సిపల్ ఎన్నికలకు సం బంధించి టీఓటీ, ఆర్వో, ఏఆర్‌ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

కలెక్టర్ హాజరై మాట్లాడుతూ హ్యాండ్ బుక్ ను క్షుణ్ణంగా చదవి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల నిర్వ హణలో ఆర్వోల పాత్ర కీలకమన్నారు. నా మినేషన్ల స్వీకరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.