calender_icon.png 24 January, 2026 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ ఓటరు దినోత్సవం జరుపుకొన్న అయిజ ఉన్నత పాఠశాల విద్యార్థులు

24-01-2026 12:00:00 AM

అయిజ జనవరి 23: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకున్నామని ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి అన్నారు.ఆయన మాట్లాడుతూ జనవరి 25- 2011 నుండి దేశవ్యాప్తంగా జరుపుకోవడం ప్రారంభించారని అందులో భాగంగా ఉదయం ప్రార్థనలో జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించామని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రలోభాలకు లొంగ కుండా, నిష్పక్ష పాతంగా ఓటు వినియోగించుకోవాలని, ఇట్టి విషయాన్ని మీ ఇంట్లో తల్లిదండ్రులకు తెలియ చెప్పి చైతన్య వంతులను చేయాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చే యించామని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.