08-08-2025 05:27:03 PM
ఎంతోమంది త్యాగాల ఫలితమే భారత స్వాతంత్రం..
బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు..
కామారెడ్డి (విజయక్రాంతి): స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఏగురవేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు(BJP District President Neelam Chinna Raju) అన్నారు. శుక్రవారం కామారెడ్డి బిజెపి జిల్లా కార్యాలయంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా స్మృతి దినం, హర్గర్ తిరంగా, స్థిరంగా యాత్రలపై అంశంపై కార్యాశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ఇందుకోసం ప్రజలను జాగ్రత్తపరచాల్సిన బాధ్యత ప్రతి బిజెపి కార్యకర్తపై ఉందన్నారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా వార్తా సహస్త్రం ఉద్యమం గురించి నేటి తరానికి అర్థమయ్యేలా వివరించాలన్నారు.
ఈనెల 13 14 తేదీన ప్రతి మండలము గ్రామంలో తిరంగా యాత్రలు చేయాలని పిలుపునిచ్చారు. హర్గర్ ధరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జెండా అందజేయాలని అన్నారు. ఆగస్టు 14న భారత్ పాకిస్తాన్ దేశాలు రెండుగా విభజించబడిన నాటి గాయాలు వివరించాలన్నారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో సూత్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రపరిచి ప్రాంగణమంతా శుభ్రం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా మాజీ అధ్యక్షురాలు అరుణాతార, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేష్, కుంట లక్ష్మారెడ్డి, అన్నారం మోహన్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలలో భాగంగా నిర్వహించే విభజన గాయల స్మృతి దినం, హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్రలపై అంశంపై బీజేపీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో కార్యశాల నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ... స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జండా ఎగరవేయాలని, ఇందుకోసం ప్రజలను జాగృత పరచాల్సిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్తలపై ఉందని అన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితైన భారత స్వాతంత్ర ఉద్యమం గురించి నేటి తరానికి అర్థం అయ్యేలా వివరించాలని అన్నారు. ఈ నెల 13,14 తేదీన ప్రతి మండలం, గ్రామంలో తిరంగా యాత్ర లు చేయాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జండాను అందజేయాలని అన్నారు. ఆగస్ట్ 14 న భారత్, పాకిస్థాన్ దేశాలు రెండుగా విభజించబడిన నాటి గాయాలు వివరించాలని అన్నారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలను శుభ్రపరిచి ప్రాంగణం అంతా శుభ్రం చేయాలని అన్నారు.