26-01-2026 12:09:29 PM
రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
పాపన్నపేట,జనవరి 26: మండల కేంద్రం పాపన్నపేట తోపాటు ఆయా గ్రామాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయితీల్లో సర్పంచులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, ఆసుపత్రులు, వివిధ సంఘాల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్ద ఆలయ ఈవో చంద్రశేఖర్ జెండా ఆవిష్కరణ చేశారు.