02-07-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
చండూరు, జూలై 1( విజయ క్రాంతి): కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై, కార్మికుల హక్కులను కాలరాస్తున్న సర్కార్ పై జూలై 9 న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని , సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసం ఆపరేషన్ కగారు పేరుతో మోడీ ప్రభుత్వం మావోయిస్టులను, ఆదివాసీలను, బూటకపు ఎన్ కౌంటర్లు చేయడం సరైనది కాదు అని, నక్సలైట్లు కూడా ఈ దేశ పౌరులేనని ఆయన అన్నారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో సంపద అంతా కొద్దిమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమైందన్నారు. సంపద కేంద్రీకృతం కావడంతో అసమానతలు విరిగిపోయాయి అని ఆయనవిమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా కార్మికులు సమద్వికి గురవుతున్నారని ఆయన అన్నారు. కార్మికుల శ్రమను పెట్టుబడిదారులకు రాజ్యాంగబద్ధంగా లోటు చేస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలని, భూభారతిలో రైతులు పెట్టిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. భారత జాతీయమహిళా సమైక్య సభ్యులు జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెకు అందరూ హాజరు కావాలని ఆయన వారిని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గురిజ రామచంద్రం, జిల్లా కార్య వర్గ సభ్యులు అంజయ్య చారి, నల్పరాజు రామలింగయ్య, మండల కార్యదర్శి నల్పరాజు సతీష్, బరిగెల వెంకటేష్, బండమీది వెంకన్న, గంట రమేష్,ఊషయ్య పరమేష్, తదితరులు పాల్గొన్నారు.