05-07-2025 03:20:15 PM
కరీంనగర్,(విజయక్రాంతి): సినీ గేయ రచయిత గుండేటి రమేష్ రచన, గానం, దర్శకత్వం లో రూపుదిద్దుకోనున్న "ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైభవ గీతం పోస్టర్ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం రోజున కరీంనగర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకులు గుండేటి రమేష్ మాట్లాడుతూ ఈనెల 19 నుండి ఉమ్మడి కరీంనగర్ వైభవ షూటింగ్ ప్రారంభమవుతుందని, ఆగస్టు 2న గుండేటి మ్యూజిక్, మూవీస్ ద్వారా ఆల్బమ్ రిలీజ్ అవుతుందని తెలిపారు.