05-07-2025 02:41:34 PM
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
రైతులను కాంగ్రెస్ మోసం చేసింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు(Ramchander Rao Takes Charge) శనివారం బాధ్యతలు స్వీకరించారు. రామచందర్ రావును కాషాయ శ్రేణులు గజమాలతో సత్కరించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి రామచందర్ రావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బేజీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీలకు ఇక్కడ పరిపాలించే అవకాశం దక్కిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రైతులకు రుణమాఫీ అన్నారు.. పూర్తిగా చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కొరత వచ్చింది.. కేంద్ర నుంచి వచ్చి యూరియా ఏం చేశారు? అని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ నెరవేర్చలేని రామచందర్ రావు ఆరోపించారు. రైతులను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కార్యకర్తనుంచి రాష్ట్ర అధ్యక్షుడి అవకాశం ఒక్క బీజేపీలోనే సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అల్లాడి పోతున్నారని ఆయన సూచించారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రామచందర్ రావు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. బీజేపీ పరిపాలనలో అవినీతి ఉండదని రామచందర్ రావు తేల్చిచెప్పారు.