calender_icon.png 5 July, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

40కి చేరిన పాశామైలారం మృతుల సంఖ్య

05-07-2025 02:47:24 PM

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశామైలారంలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మున్మున్ అనే వ్యక్తి శనివారం మృతి చెందారు. సిగాచీ ప్రమాద ఘటనలో మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ఇద్దరు బీహార్, ఒకరు ఒడిశా కార్మికులు ఉన్నారని, ఇప్పటి వరకు 36 మృతదేహాలకు పరీక్షలు నిర్వహించి, వారి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.