05-07-2025 02:51:45 PM
మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ బాలికల ఎస్ఎంఎస్ హాస్టల్ ను, మంథని పట్టణంలో సంగీత నృత్య కళాశాల పక్కా భవనం నిర్మించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ శనివారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు పది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ జిల్లా కేంద్రంలో ఎస్సీ బాలికల ఎస్ఎంఎస్ హాస్టల్ లేకపోవడం వల్ల విద్యార్థినిలు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని, ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఎస్సీ బాలికల ఎస్ఎంఎస్ హాస్టల్ ను ప్రారంభించి విద్యార్థినిల చదువుకు తోడ్పలాలని అన్నారు. అలాగే మంథని కేంద్రంలో ఉన్నటువంటి సంగీత నృత్య కళాశాల గత కొన్ని సంవత్సరాలుగా అద్దభవనంలోనే కొనసాగుతుందని, అలాగే సంగీత నృత్య కళాశాలలో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.