calender_icon.png 13 October, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీసరలో బోనాల సందడి

13-10-2025 12:00:00 AM

బొడ్రాయి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

కీసర, అక్టోబర్ 12:ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడ్చల్ ఎమ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. కీసర మండల కేంద్రంలో ఆదివారం  అత్యంత వైభవంగా నిర్వహించిన బొడ్రాయి, బోనాల పండుగ కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  నాభి శిలకు, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.బొడ్రాయి పండుగ గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చేసుకునే గొప్ప పండుగన్నారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే  పేర్కొన్నారు.

కీసర గ్రామాభివృద్ధికి, ఆలయాల పునరుద్ధరణకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు .ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకట్ రెడ్డి, కీసర నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.