7 వేల కోసం తొక్కించి హత్య?
16-08-2026 12:00 AM
నాగర్ కర్నూల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): తీసుకున్న అప్పును చెల్లించకుండా ఓ మహిళను వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి రాకొండ గ్రామానికి చెందిన నాగి బంగారమ్మ (43) తాడూరుకు చెందిన భీమయ్య శనివారం వాహనంతో తొక్కించి చంపాడనే ఆరోపణలున్నాయి.






