పాత పెన్షన్‌ను వెంటనే పునరుద్ధరించాలి
టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి
టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా శాఖ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
కామారెడ్డి, ఆగస్ట్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి టీఎన్జీఓస్ జిల్లా కార్యవర్గ సమావేశం టీఎన్జీఓస్ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సమావేశంలో ఎజెండా అంశాలు అన్నిటిని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు.
ఉద్యోగుల పెండింగ్ 6 డి.ఏ లతో పాటుగా, ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు పెండింగ్ బిల్లులతో పాటు వారికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని సమావేశం లో డిమాండ్ చేశారు. ఉద్యోగుల అత్యంత అవసమైన ఉద్యోగుల ఆరోగ్య కార్డులు మంజూరు చేసి ఉద్యోగులను కాపాడుకోవాల్సిన భాద్యత ప్రభుత్వానిధి అని గుర్తుకు చేశారు. ఉద్యోగులకు రావాల్సిన PRC సత్వరమే 51% ఫిట్మెంట్ మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగుల పాలిట పెను శాపంగా మరీనా సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. టిఎన్జీవోస్ జెండా, కండువాలు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. శివకుమార్,సహాధ్యక్షులు ఎం చక్రధర్,కోశాధికారి ఎమ్ దేవరాజు,ఉపాధ్యక్షులు జె. శ్రవణ్ కుమార్, రాజ్యలక్ష్మి, జాయింట్ సెక్రటరీలు రమణ కుమార్, రాజారెడ్డి, రాజమణి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్. సంతోష్ కుమార్..పబ్లిసిటీ సెక్రటరీ రాజ్ కుమార్.EC మెంబర్లు దత్తాద్రి.ఎల్లారెడ్డి తాలూకా అధ్యక్ష కార్యదర్శులు మహిపాల్ , శరన్.కామారెడ్డి తాలుక అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సృజన్ రెడ్డి దోమకొండ తాలూకా అధ్యక్షులు బి. సంతోష్ కుమార్, అల్లాడి రమేష్ బాన్సువాడ తాలూకా కార్యదర్శి అజీమొద్దీన్, రవి, తదితరులు పాల్గొన్నారు.






