26-12-2025 12:00:00 AM
న్యాయం జరిగేలా చూస్తామన్న డిపో మేనేజర్
నిర్మల్ డిసెంబర్ 25 (విజయక్రాంతి) : నిర్మల్ డిపో ద్వారా నర్సాపూర్ మండలంలోని గొల్లమడ గ్రామానికి టీజీ ఆర్టీసీ అధికారులు నడిపిస్తున్న పల్లె బస్సు కంకట గ్రామానికి రద్దు చేయడంపై గ్రామస్తులు గురువారం ఆందోళన నిర్వహించారు.
నిర్మల్ నుంచి గొల్లమడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులు కంకట క్రాస్ రోడ్ వద్ద ఆపి ధర్నా చేశారు. గతంలో కంకటకు బస్సు నడిపేదని ఆర్టీసీ అధికారులు రద్దు చేయడంపై వారు మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆర్టిసి సిబ్బంది నిర్మల్ డిపో మేనేజర్‌కు సమాచారం ఇవ్వగా తప్పకుండా న్యాయం జరగట్లు చూస్తామని హామీ ఇచ్చారు బస్సు రాక పోవ డం వల్ల పిల్లలు వృద్దులు ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.