calender_icon.png 26 December, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

26-12-2025 12:00:00 AM

నిర్మల్ డిసెంబర్ 25 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు గురువారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి.

ఈ దీక్షలకు ఉద్యోగ సంఘాల నేతలైన వాహీద్ ఖాన్ ఇర్ఫానుద్దీన్ తెలంగాణ కళాకారుల సంఘం సభ్యులు అరిసెల రాజు కిరణ్ కుమార్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బిజెపి పార్లమెంట్ బాధ్యులు ఏ భూమయ్య ఆ సుధాకర్ వివిధ సొసైటీల సభ్యులు మద్దతు తెలంగాణ ఉద్యమకారుడు కవి డాక్టర్ కృష్ణంరాజు డిటిఎఫ్ బాధ్యులు మద్దతు పలికి సంఘీభావం తెలిపారు విలేకరులు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు.