calender_icon.png 17 November, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టజీవుల పార్టీ.. ప్రజా పోరాటాల పార్టీ.. సీపీఐ

17-11-2025 12:00:00 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ

కామారెడ్డి, నవంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి  జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద భారీ ర్యాలీ బహిరంగ సభ ఆదివారం రాత్రి 8 గంటలకు  నిర్వహించారు. ఈ బహిరంగ సభకు కామారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి . ఎల్. దశరథ్ అధ్యక్షత వహించగా ఈ సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ హాజరై మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీని దేశంలో ఇప్పటివరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజల ఆదరణ పొందిందని సిపిఐ త్యాగం వెలకట్టలేనిదని ఆమె అన్నారు. 

డిసెంబర్ 26న ఖమ్మం లో జరిగే వంద సంవత్సరాల సభను విజయవంతం చేయాలని కోరారు.  కామారెడ్డి జిల్లాలో భారీ వర్షంతో రైతు పంటలు వర్షంతో దెబ్బతిన్న ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నష్టపోయిన ప్రజలకు ఇప్పటివరకు ఎలాంటి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకరించలేదని ఆమె అన్నారు. అదేవిధంగా ముందు ముందు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు.

కామారెడ్డి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడు పనిహారం రంగాచారి విగ్రహానికి కామారెడ్డి మున్సిపల్ వద్ద నివాళులర్పించి అనంతరం నిజం సాగర్ చౌరస్తా చాకలి ఐలమ్మకు నివాళులర్పించి రెండవ రోజు జాతాలు కామారెడ్డిలో నిర్వహించడం జరిగిందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ,  ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలి ఉల్లాఖాద్రి,

సిపిఐ రాష్ట్ర నాయకులు k .భూమయ్య,  సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దుబాస్ రాములు, సిపిఐ జిల్లా నాయకులు కే శ్రీనివాస్, V .రాజిరెడ్డి, ఎం. దేవయ్య, జి. మల్లేష్, ఎం రాజమణి, ఎండి రఫీక్, సురేష్, దేవరాజు, లక్ష్మణ్, రమేష్ ,నర్సింలు, సందీప్, నాగమణి ,స్వప్న, రేఖ, ఈశ్వర్, రాములు ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి ఉప్పలయ్య బృందం పాల్గొన్నారు. జిల్లా నుండి ప్రజాసంఘాల నుండి కార్మిక సంఘాల నుండి బస్సు జాత లో పాల్గొన్నారు.