17-11-2025 12:00:00 AM
-ప్రపంచ దేశాలకు రోల్ మోడల్ ముల్కనూర్ సొసైటీ
-సహకార సంఘం అధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ బైలా చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి
భీమదేవరపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): ముల్కనూర్ సహకార సంఘాన్ని ప్రపంచ దేశాలకు రోల్ మోడల్‌గా నిలిపామని ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాం కు అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో 72వ సహకార వారోత్సవాలు ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా హాజరైన రైతులతో ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు లకు ఇన్సూరెన్స్ పథకం అమలుకు కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిందని, దానికి చైర్మన్‌గా సలహాలు సూచనలు అందించేందుకు తనను రైతులకు ఉపయోగకరంగా ఉండే ఇన్సూరెన్స్ బైలా చైర్మన్‌గా నియమించింది అన్నా రు.
సహకార సంఘాలు కేవలం రైతులకు సేవలు అందించేందుకు కాకుండా రైతులకు ఉపయోగపడేలా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు రైస్ మిల్లు లు, విత్తనాలు తయారు చేయడం, పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయడం సలహాలు ఇచ్చినట్టు చెప్పారు. ప్రపంచ స్థాయి, జాతీయ స్థాయి సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు తగు సూచనలు ఇచ్చామని పేర్కొ న్నారు.
సహకార వ్యవస్థలో 50 సంవత్సరాల తర్వాత చేపట్టబోయే పనులు ముల్క నూర్ సహకార సంఘం అన్ని రంగాలలో ముందున్నదని కేంద్ర ప్రభుత్వం దీనిపై సహకార సంస్థలు అధ్యయనం చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నా రు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను విదేశాలకు పంపి లాభాలు ఆర్థిక దిశగా పయనం కొనసాగుతుంది అన్నారు.
రైతులకు అనుకోకుండా ఏదైనా విపత్తు సంభ విస్తే రూ.50 లక్షలు వచ్చే విధంగా ఇన్సూరెన్స్ పథకాలు వర్తింపజేసే విధంగా చర్యల గురించి సమావేశాలలో సూచనలు అందించినట్లు తెలిపారు. రైతులకు వాహనాల, కరెంట్ మోటర్, గోదాములు ఇన్సూరెన్స్ పథకాలు జాతీయస్థాయిలో అమలకు చర్య ల గురించి సెమినార్లలో ప్రస్తావించినట్టు చెప్పారు. రైతులు కేవలం పంటలు పండించడమే కాకుండా ప్రాసెసింగ్ గ్రేడింగ్, ప్యా కింగ్, బైండింగ్ తయారుచేసి లాభాలు ఇచ్చే విధంగా సలహాలు, సూచనలు అమ లు చేయడం జరుగుతుందన్నారు.
రైతు కు టుంబాలు సీడ్ ఎక్స్‌పోర్టు టూరిజం, టాక్సీ వివిధ రంగాలలో సహకార సంస్థలు ఎలా పని చేయాలో అధ్యయనం చేసి చూపించినట్టు వెల్లడించారు. సమావేశంలో కేయూ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ యాకుబు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ నారాయణ, జిఎం మార్పా టి రామ్‌రెడ్డి, సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడు గజ్జి వీరయ్య, లోన్స్ మేనేజర్ రాజ మౌళి, సిబ్బంది వెంకటేశ్వరరావు, జోగిరెడ్డి, చెవాల బుచ్చయ్య పాల్గొన్నారు.