calender_icon.png 10 January, 2026 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాండీస్ బారి నుంచి రోగికి విముక్తి

10-01-2026 02:16:40 AM

కిమ్స్ కొండాపూర్‌లో విజయవంతంగా చికిత్స

హైదరాబాద్, 9 జనవరి: ఎనిమిదేళ్లుగా తీవ్రమైన జాండీస్ (పసకలు)తో ఎనిమిదేళ్లుగా బాధపడుతున్న రోగికి కిమ్స్ హాస్పిట ల్స్ కొండాపూర్ వైద్య బృందం విజయవంతంగా చికిత్స చేసి విముక్తి కల్పించింది.కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ ప్యాంక్రియాస్ స్పెషలిస్ట్ డాక్టర్ రావు ల ఫణి కృష్ణ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగికి ఎనిమిదేళ్ల క్రితం పాంక్రియాస్లో ఏర్పడిన న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అని నిర్ధారణ అయింది. ఇది నెమ్మదిగా పెరిగే అరుదైన కణితిగా మారిం ది. దీంతో పిత్తనాళాన్ని అడ్డుకోవడం వల్ల జాండీస్ వ్యాధి వల్ల తరుచూ తీవ్రమైన వాంతులు, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి తీవ్రమైన సమస్యలనుతో ఇబ్బంది పడుతున్నాడు.దీనివల్ల శస్త్రచికిత్స సమయంలో ప్రాణాంతక రక్తస్రావం జరిగే ప్రమాదం ఉండటంతో ఆపరేషన్ అసాధ్యమని పలుచోట్ల వైద్యులు తేల్చారు.దీంతో గత ఏడేళ్లుగా జాండీస్ రోగాన్ని తగ్గించేందుకు మెటాలిక్ బిలియరీ స్టెంటింగ్‌పై ఆధారపడాల్సి వచ్చింది.

ఇవి ఐదు నుంచి ఆరు నెలలకే పనిచేస్తాయి. అదే క్రమంగా 24 సార్లకు పైగా ఈ ఆర్ సీపీ చేయించుకున్నాడు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్సల కోసం లక్షలు రుపాయాలు ఖర్చు చేశాడు. శాశ్వత పరిష్కారం కోసం రోగి పాంక్రియాటిక్ శస్త్రచికిత్సలకు ప్రసిద్ధిగాంచిన జర్మనీ, హైడెల్‌బర్గ్‌కు వెళ్లాడు. అక్కడ 1.5 కోట్ల వ్యయంతో 20 శాతం ప్రమాదంతో కూడిన శస్త్రచికిత్సను సూచించారు.

అది సాధ్యం కాక తిరిగి భారతదేశానికి వచ్చి, తీవ్ర జ్వరం ఉన్న పరిస్థితిలో డా. ఫణి కృష్ణ బృందాన్ని సంప్రదించాడు.శాశ్వత చికిత్స కోసం రెండు దశల్లో శస్త్రచికిత్స చేయాలని మా బృందం నిర్ణయించింది. గ్యాస్ట్రో, హెపాటోబిలియరీ, వాస్క్యులర్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ నైపుణ్యాలను సమన్వయంతో వినియోగించింది. మొదటి దశలో అత్యంత క్లిష్టమైన షంట్ శస్త్రచికిత్స నిర్వహించి, పేగుల రక్త ప్రవాహాన్ని కిడ్నీ నాళానికి మళ్లించాం. దీనివల్ల పోర్టల్ హైపర్టెన్షన్ తగ్గి, విపరీతంగా విస్తరించిన రక్తనాళాలు కుంచించుకుపోయాయి.

దీంతో రక్తస్రావం లేకుండా ప్రధాన శస్త్రచికిత్స చేయడానికి మార్గం సుగమమైంది.రెండో దశలో దాదాపు 10 గంటల పాటు సాగిన శస్త్రచికిత్సలో పిత్తనాళం అడ్డంకి, పేగుల అడ్డంకిని శాశ్వతంగా తొలగించారు. రక్తస్రా వం లేకుండా ఈ శస్త్రచికిత్స పూర్తి కావడం వైద్య రంగంలో అరుదైన విజయంగా నిలిచింది. శస్త్రచికిత్స అనంతరం రోగి ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా కోలుకున్నాడు. ఆరు నెలలకే తన ఐటీ ఉద్యోగానికి తిరిగి చేరి, ఎనిమిదేళ్ల బాధ నుంచి పూర్తిగా విముక్తి పొందాడు.