10-01-2026 12:06:10 PM
హైదరాబాద్: మూవీ లవర్స్(Movie Lovers)కి 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం షాకిచ్చింది. 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం టికెట్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్ లలో జీఎస్టీతో కలిపి రూ. 100, సింగిల్ స్క్రీన్ ఏసీ థియేటర్ లో రూ. 50, సింగిల్ స్క్రీన్ నాన్ ఏసీ థియేటర్లలో రూ. 30 పెంచుకునేందుకు అనుమచ్చింది. జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ కు కూడా అనుమతిచ్చింది. టికెట్ల పెంపు ఈ నెల 12 నుంచి 18 వరకు వర్తిస్తుందని ప్రభుత్వం సూచించింది.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జనవరి 11 సాయంత్రం ప్రీమియర్ షోలను ప్రదర్శించనుంది. ఈ చిత్రంలో నయనతార(Nayanthara) కథానాయికగా నటిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) ఇప్పటికే టిక్కెట్ల ధరల పెంపుకు అనుమతులు జారీ చేసింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా(Catherine Tresa), సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమతం, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
