10-01-2026 10:52:21 AM
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి: మధుసూదన్ జీ
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): పవర్ సెక్టార్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను(Contract Employees) వెంటనే పర్మినెంట్ చేస్థామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నిలబెట్టుకునేలా కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధం జాతీయ అధ్యక్షుడు మధుసూదన్ జీ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో అనుబంధ సంఘం తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా, క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పవర్ సెక్టార్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పెన్షన్ స్కీం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే న్యాయపరంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ , కంపెనీ ప్రెసిడెంట్ బాలరాజ్, బిఎంఎస్ టిఆర్పియూ , జిల్లా ప్రెసిడెంట్ ప్రకాష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.