calender_icon.png 11 January, 2026 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపైనే మురికి నీరు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు

10-01-2026 10:45:02 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఎలుకపల్లి గ్రామంలో రోడ్డుపైనే మురికి నీరు ప్రవహిస్తుందని ప్రజలు తెలుపుతున్నారు. పాఠశాల పక్కన ఉన్న రోడ్డు పై మురికి నీరు ప్రవహించడంతో తాగునీటి కోసం రోడ్డుపై నడుచుకుంటూ మహిళలు వాగుకు, పంట పొలాలకు రైతులు,కూలీలు వెళుతుంటారు. కొంతమంది ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు  నిర్మించుకోకపోవడంతో ఆ నీటిని రోడ్డుపైకే వదలడంతో రోడ్ అంతా బురదమయంగా మురికి నీటితో నిండిపోయి ఉండడంతో కాలనీ ప్రజలు మురికి నీటిని తాకుతూ వెళ్లాల్సిన పరిస్థితిగా మారిందని కాలనీ ప్రజలు తెలుపుతున్నారు. మురికి నీరు ప్రధాన రహదారిపై ఉండడంతో దుర్వాసన వస్తుందని ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రధాన రహదారిపైకి మురికినీరు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.