10-01-2026 10:49:38 AM
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.
కొల్లాపూర్ రూరల్: నిజాలను నిర్భయంగా రాసే సత్తా విజయక్రాంతి దిన పత్రికకు ఉందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో విజయక్రాంతి పత్రిక నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... డిజిటల్ రంగాల్లో కూడా పత్రిక దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత దండు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బచ్చలకూర బాలరాజ్, విజయక్రాంతి కొల్లాపూర్ రిపోర్టర్ ఏదుల వెంకటేష్, సోమశిల మాజీ సర్పంచ్ బింగి మద్దిలేటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,