10-01-2026 10:43:27 AM
గత 15 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న...
ప్రజలు అవకాశం ఇస్తే 16 వ వాడు నుండి కౌన్సిలర్ గా పోటీ చేస్తా...
బిఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధం...
బిఆర్ఎస్ 16 వ వార్డు ఇంచార్జ్ శ్రీనివాస్ యాదవ్ (వేణు)...
బాన్సువాడ,(విజయక్రాంతి): ప్రజాసేవలో ఉంటున్న ప్రజల కోసమే పని చేస్తానంటూ బి ఆర్ ఎస్ సిద్ధిగల్లి 16 వ వార్డు ఇంచార్జ్ శ్రీనివాస్ యాదవ్ (వేణు) పేర్కొనడం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం కు చెందిన శ్రీనివాస్ యాదవ్ గత 15 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజాసేవ చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేయడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ జుబేర్, మాజీ రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి మాజీ జడ్పిటిసి నార్ల రత్నకుమార్ ఆశీర్వాదంతో పార్టీలో చురుకుగా పనిచేస్తూ కాలనీ సమస్యలను పడినప్పుడు పరిష్కరిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న నాయకుడు శ్రీనివాస్ యాదవ్ అని ప్రజలు కూడా ఆయనకే మద్దతు తెలియపడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
పెద్దలు అవకాశం ఇస్తే తిరిగి 16వ వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తానని అంతేకాకుండా టిఆర్ఎస్ అధిష్టానం పార్టీ పరంగా టికెట్ ఇస్తే కౌన్సిలర్ గా పోటీ చేస్తానని అందుకు ప్రజలు కూడా కాలనీవాసులు కూడా మద్దతు తెలిపితే కౌన్సిలర్ గా పోటీ చేసి ప్రజా సమస్యల పరిష్కారమే తన దేయమని పేర్కొనడం జరిగింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నూతన పింఛన్లు సీఎం రిలీఫ్ ఫండ్ రైతుల సంక్షేమం వంటి అనేక వాటి సమస్యలను పరిష్కరించి ప్రజలకు సహకరించానాని మళ్లీ ప్రజలు అవకాశం ఇస్తే కౌన్సిలర్ గా పోటీ చేసి సేవలందిస్తానని అందుకు ప్రజలు కాలనీవాసులు సహకరించాలని కోరుతున్నట్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కాలనీలో తాగునీటి సమస్య డ్రైనేజీల సమస్య రోడ్ల సమస్యను గత ప్రభుత్వంలో పరిష్కరించాలని మున్ముందు మరిన్ని అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. కాలనీ వాసులందరూ సహకరించి మద్దతు తెలిపితే కౌన్సిలర్ గా గెలుపొంది మరింత ప్రజాసేవ చేస్తానని ఆయన అన్నారు.