calender_icon.png 10 January, 2026 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

10-01-2026 01:45:32 AM

  1. బ్లాక్ స్పాట్స్, వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి 
  2. ప్రతీ నెలా రెండో శుక్రవారం సమన్వయ భేటీ
  3. పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్  

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 9 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన అజెండాగా పోలీస్, రెవెన్యూ, రవాణా, జీహెచ్ ఎంసీ సహా ఇతర అనుబంధ శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ  సజ్జనార్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు.

శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంట ర్‌లో రోడ్డు భద్రతపై వివిధ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రా ఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్లతో కలిసి సీపీ సజ్జనార్ పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఈ సంర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ నగరంలో తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పా ట్స్ గుర్తించి, వాటిని తక్షణమే సరిదిద్దాలన్నారు.  రాత్రి వేళల్లో జరిగే ప్రమాదాల నివారణకు వీధి దీపాల నిర్వహణ అత్యంత కీలకమని, ఎక్కడైనా లైట్లు వెలగకపోతే వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆధునిక బారికేడింగ్, పటిష్టమైన డివైడర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా వాహనదారులు, పాదచారుల భద్రతను పెంచవచ్చని వివరించారు.

నగర రోడ్లపై పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్‌లను విస్తృతంగా ఏర్పా టు చేయాలన్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి చిరు వ్యాపారాలు నిర్వహిస్తే ట్రాఫిక్ విభాగం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రతా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఇకపై ప్రతి నెలా రెండో శుక్రవారం అనుబంధ శాఖల సమన్వయ సమావేశం నిర్వ హించాలని సీపీ సజ్జనార్ నిర్ణయించారు.

స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.ఈ సమా వేశంలో హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఆర్టీవో పురుషోత్తం రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎంసుధా పరిమళ, యునిసెఫ్, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ, మోర్త్ ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.