calender_icon.png 11 January, 2026 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆల్ఫాజోలం పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు

10-01-2026 10:38:41 AM

ముగ్గురు నిందితులు అరెస్టు

జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆల్ఫ్రా జోలమ్(Alprazolam) అక్రమ రవాణా జరుగుతుందని విశ్వసనీయ సమాచారం మేరకు జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ రహదారిపై(Mahabubnagar Road) నక్కలబండ తండా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించి ద్విచక్ర వాహనపై వెళ్తున్న పెద్దతండ గ్రామం కోయిలకొండ మండలానికి చెందిన  కొండ్యా నాయక్ వద్ద 240 గ్రాముల ఆల్ఫ్రాజోలమ్, ద్విచక్ర వాహనం సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కొండ్యా నాయక్  ఇచ్చిన సమాచారంతో అతనికి సరఫరా చేసిన దమ్మాయిగూడ కు చెందిన  రాం సాగర్, నాగరాజు, లను మౌలాలి, హైదరాబాద్ నందు అదుపులోకి తీసుకొని వారినుండి 85 గ్రాముల ఆల్ఫ్రాజోలమ్ ద్విచక్ర వాహనం ను సెల్ ఫోన్ లను స్వాధీనం పరుచుకోవడం జరిగింది.

 తదుపరి విచారణలో వారు ఇట్టి ఆల్ఫ్రాజోలమ్ ను 1 గ్రాముకు 1000 రూపాయల చొప్పున మహబూబ్ నగర్ లో గల ఉన్న వివిధ గ్రామాలలో విక్రయించుచున్నామని తెలిపారు. తదుపరి ముగ్గురిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచి రిమాండ్ పంపడం జరిగింది. ఇట్టి తనిఖీల్లో ఎస్ఐలు టీ.కార్తిక్ రెడ్డి. జె.నాగరాజు,హెడ్ కానిస్టేబుల్స్ ఏ. రమేష్,మురళి మోహన్, కానిస్టేబుల్స్ బి.సిద్ధార్థ్,సి.అనిల్ కుమార్ లు పాల్గొనడం జరిగింది.