calender_icon.png 22 October, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వీపకల్పం.. ధగధగాయమానం

22-10-2025 01:00:07 AM

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా

న్యూఢిల్లీ, అక్టోబర్ 21:‘భారత ద్వీపకల్పం ధగధగాయమానంగా వెలుగొందుతోంది. అంతరిక్షం నుంచి ఉప ఖండం వెలుగులు ప్రసరిస్తున్న ఆభరణంలా కనువిందు చేస్తున్నది. ఇక్కడి నుంచి భారత్ ఒక సజీవ గెలాక్సీని తలపిస్తోంది’ అంటూ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అభివర్ణించారు. జూన్‌లో 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉండి ‘యాక్సియమ్ మిషన్ ఉన్న ఆయన.. నాడు తాను స్వయంగా తీసిన చిత్రాలు, వీడియోలను దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు. 

అంతరిక్షం నుంచి ‘మిరుమిట్లతో వెలుగొందుతున్న భారత్‌ను చూడండి’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ‘దీపస్తంభ కాంతులు నగరమంతా వ్యాపించినట్లు పుణె ప్రజ్వరిల్లు తుంది’ అంటూ ఫుణెను ఉద్దేశించి అభివర్ణించారు. అలాగే మానవ హస్తాలు సృష్టించిన నక్షత్రపు రాశుల్లా బెంగళూరు, హైదరాబాద్ నగరాలు తళుక్కుమంటున్నాయని వర్ణించారు.