calender_icon.png 22 October, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా మేనల్లుడి వివాహానికి రండి

22-10-2025 01:01:15 AM

బయోకాన్ లిమిటెట్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఆహ్వానం

బెంగళూరు, అక్టోబర్ 21: బయోకాన్ లిమిటెట్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా మంగ ళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ను వేర్వేరుగా వారి నివాసాలకు వెళ్లి కళిశారు. తన మేనల్లుడి వివాహానికి రావాలని శుభలేఖలు అందించి ఆహ్వానం పలికారు.  ఇటీవల బెంగళూరు రోడ్ల దుస్థితిపై ఓ విదేశీ విజిటర్ నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడ్డానని కిరణ్ మజేందార్ షా ఓ పోస్టు లో వెల్లడించడంతో వైరల్‌గా మారింది.

దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యంగంగా బదులిచ్చారు.. ఆమె రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చే యొచ్చన్నారు. అందుకు నిధులు కూడా ఇస్తామని చెప్పారు. వ్యక్తిగత అజెండాతో నే ఆమె విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తో కిరణ్ మజుందార్ షా మంగళవారం వేర్వేరుగా సమావేశం కావడం చర్చనీయాంశమైంది. భేటీ అనంతరం కిరణ్ మజుందార్ షా మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కాసేపటికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ‘బెంగళూరు పురోగతి, రాష్ట్ర అభివృద్ధి ‘మార్గాల’లపై కిరణ్ మజుందార్ చర్చించచారని ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.