calender_icon.png 18 October, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి

18-10-2025 12:34:04 AM

బోయినపల్లి తాసిల్దార్‌కు వినతిపత్రం అందించిన నాయకులు

 బోయినపల్లి : అక్టోబర్17 ( విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి మండలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయి పై దాడి చేసిన వ్యక్తిపై కేసు న మోదు చేసి అరెస్టు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తాసిల్దార్ నారాయణ రెడ్డికి శుక్రవారం మండల ఎ మ్మార్పీఎస్ దళిత సంఘాల నాయకులు వి నతి పత్రం అందించారు. సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ బిఆర్ గవాయి న్యాయ వాదుల వాదనలు వింటుండగా రాకేష్ కిషోర్ అనే వ్యక్తి దాడి చేసి చీఫ్ జస్టిస్ ను అవమానపరిచాడ ని వారు తాసిల్దార్ కి ఇచ్చిన వినతిపత్రంలో తెలిపారు.

అటువంటి వ్యక్తిపై కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలు చర్యలు తీసుకొని ప్రజాస్వామిక దృక్పథం కలిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమన చేసిన మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించి అందు కు బాధ్యుడైన వ్యక్తితో పాటు ఆయన వెనుక ఉన్న దుర్మార్గపు శక్తులను కూడా కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ సంఘటన పూర్తి అనాగరికమైన చర్య అని వారు చెప్పా రు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి దళితుడు అయినందువలన ఇటువంటి అ నాగరికమైన చర్యకు పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దాడి ముమ్మాటికీ భారత రాజ్యాంగం పైననే జరిగిందని వారన్నారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు కో సం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచే సే పదవి విరమణ చేసిన వారిని ఎంపిక చేసి ప్రత్యేక దర్యాప్తు చేయించి నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా చూడాలని వారు కోరా రు. లేకుంటే భారతదేశ వ్యాప్తంగా దళిత సం ఘాలు ఆందోళన చేస్తున్నట్లు వారు తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండ ల శాఖ అధ్యక్షుడు ఇల్లందుల రాజు కొంకటి రమేష్, విహెచ్ పిఎస్ జిల్లా కో కన్వీనర్ కత్తెరపాక రవీందర్, మండల ఉపాధ్యక్షులు అ క్కెనపల్లి పరశురాములు, మండల నాయకు లు గుడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.