calender_icon.png 18 October, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీ టెండరింగ్ తప్పదా?

18-10-2025 12:35:27 AM

 మద్యం దరఖాస్తులకు స్పందన కరువు నేటితో ముగియనున్న గడువు

కరీంనగర్, అక్టోబరు 17| (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మ ద్యం పాలసీకి స్పందన కరువయింది. ఈ నెల 18(నేటితో) దరఖాస్తు గడువు ముగియవస్తున్నా అశించినరీతిలో కరీంనగర్ ఉమ్మ డి జిల్లాలో దరఖాస్తులు దాఖలు కాలేదు. దరఖాస్తుల సంఖ్య కేటాయించిన గెజిట్ షా పుల వారీగా 10 కంటే తక్కువ వస్తే రీ-టెండర్ జరిపే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా లో 50కిపైగా పాపులకు రీ-టెండర్ దాఖల య్యే అవకాశాలు లేకపోలేదు.

ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఎక్సైజ్ శాఖల పరిధిలో మొత్తం 294 మద్యం పాపులకు నో టిఫికేషన్ జారీ చేశారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 94 దుకాణాలు ఉ న్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 2 వే లలోపు దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో గురువారంనాటికి 419 రాగా, ఒక్క గురువారమే 186 దరఖాస్తులు వచ్చా యి. శుక్రవారం 200కు పైగానే దరఖాస్తులు వచ్చాయి. చివరిరోజైనా శనివారం భారీ సంఖ్యలో దరఖాస్తులు దాఖలయ్యే అవకా శం ఉంది.

వ్యాపారులు టెండర్ వేయాలా.. వద్దా అనే డైలామాలో ఉన్నారు. గతంలో ఉ న్న దరఖాస్తు ఫీజును 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచడంతోపాటు రియల్ ఎస్టేట్ పడిపోవడంతో మార్కెట్లో డబ్బుల రొటేషన్ త గ్గింది. ఇతర వ్యాపారాలు కూడా నడవకపోవడంతో మద్యం షాపుల వైపు వ్యాపారులు దృష్టి సారించడం లేదు. కరీంనగర్ అర్బన్ పరిధిలో 21 దుకాణాలకుగాను గురువారం వరకు కేవలం 157 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా షాపు నెం. 3కు 10, షాపు నెం. 9కి 15, షాపు నెం. 12కు 11 దరఖాస్తులు వచ్చాయి.

అదేవిధంగా కరీంనగర్ రూరల్ పరిధిలో 26 దుకాణాలు ఉండగా 119 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో షాపు నెం. 29కి 1, షాపు నెం. 34, 35, 40, 42, 46 షాపులకు ఒక్కోక్క దరఖాస్తులు మా త్రమే దాఖలయ్యాయి. తిమ్మాపూర్ ఎక్సైజ్ పరిధిలో 14 షాపులకు 56 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రాజీవ్ రాహదారిపై గుండ్లపల్లి వద్ద ఉన్న 61 పాపునకు గురువారం ఒక్క దరఖాస్తు దాఖలయింది. హు జూరాబాద్ ఎక్సైజ్ పరిధిలో 17 దుకాణాలు ఉండగా 34 దరఖాస్తులు వచ్చాయి.

జమ్మికుంట పరిధిలో 16 దుకాణాలకుగాను 53 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో షాపు నెం. 92, 93కు 12 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల గడువు 18తో ముగియనుండగా మద్యం సిండికేట్ వ్యాపారులు ఆయా షాపులకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పోటీ పడి నేడు దరఖాస్తులు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో 4000కుపైగా దరఖాస్తులు రాగా ఈసారి సంఖ్య తగ్గే అవకాశాలుమాత్రంఉన్నాయి.