18-10-2025 12:33:47 AM
పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు
సమీక్ష సమావేశంలో మాట్లాడిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో పేకాట ఆడకుండా ప్రత్యేక నిఘా ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీపావళి సందర్భంగా ఎవరైనా పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. సైబర్ క్రైమ్ ఫై ప్రజల లో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. రాత్రి వేళలో అనవసరంగా తిరిగే వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
రా పార్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. దీపావళి పండగ సందర్భంగా జిల్లా ప్రజలు పాలతో చేసినప్పుడు అయినా జాగ్రత్తలు తీసుకొని పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. పెండింగ్ కేసులపై సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా దర్యాప్తు జరుపుకోవాలని కేసు నమోదు చేసిన నుంచి చార్జింగ్ ీట్ దాఖలు చేసే వరకు ప్రతి అంశాన్ని కూలకాంక్షంగా పరిశీలించి ఫైనల్ చేయాలని సూచించారు.